ప్రభుదేవాని పెళ్లిచేసుకోవడానికి రెడీ అంటున్న హీరోయిన్!

Thursday, May 10th, 2018, 12:33:15 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పులి చిత్రంలో నటించిన నికిషా పటేల్ ఆ చిత్రం ఘోర పరాజయం పాలవడంతో ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అయితే కల్యాణరామ్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఓం3డి చిత్రంలో కూడా ఈ భామ నటించింది. అయితే ఆ చిత్రం కూడా ప్లాప్ కావడంతో నికిషా తరువాత తమిళ చిత్ర పరిశ్రమపై ఫాన్స్ పెట్టింది. ఆమె అక్కడ నటించిన ఎన్నమో ఏదో, కర్తెయొరం, నాదన్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు తగినంత గుర్తింపు లభించలేదు. కాగా ఈమె తాజాగా కోలీవుడ్ లో పాండిముని చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యకమం కోసం చెన్నై వచ్చిన నికిషా, మీడియాతో కాసేపు మాట్లాడింది.

రెండేళ్ల తరువాత తాను నటిస్తున్న తమిళ చిత్రం ఇదని, జాకీ ష్రాఫ్ గారితో కలిసి ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. అలానే అన్ని రంగాల్లో లానే సినీ రంగంలోకూడా కాస్టింగ్ కౌచ్ ఉందని, కాకపోతే ఈ సినిమారంగంలో ఆ విషయం ప్రస్తుతం బహిర్గతం అవుతోందని అన్నది. విలేఖర్లతో ఒకరు మీకు ఏహీరో అంటే ఇష్టం అని అడుగగా, చాలా మంది హీరోలంటే నాకు ఇష్టం. ముఖ్యంగా ప్రభుదేవా గారంటే మరింత ఇష్టం అని చెప్పింది. అవకాశం వస్తే ఆయనతో కలిసి నటిస్తారా అని అడగ్గా, ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు వున్నాయి, ఆయన ఒప్పుకుంటే కలిసి నటించడం ఏమిటి ఏకంగా ఆయన్ని పెళ్లి కూడా చేసుకుంటాని చెప్పి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

నిఖిషా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మిడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ప్రభుదేవాకు రామ్లత్ తో ఇదివరకే పెళ్లి అయింది. ఇద్దరుపిల్లలు కూడా వున్నారు. అయితే భార్య భర్తలిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఆపై ప్రభుదేవా నయనతారతో ప్రేమాయణం సాగించి పెళ్లిచేసుకుందాం అనుకున్న సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వారి పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది…….