బాలయ్య సినిమాలో విలన్ గా చేస్తానంటున్న మాజీ హీరో ?

Wednesday, October 18th, 2017, 11:55:48 AM IST

హీరో రాజా శేఖర్ తాజాగా నటిస్తున్న పిఎస్వి గరుడవేగా సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. గత కొన్ని రోజులుగా రాజశేఖర్ కు కెరీర్ సాఫీగా సాగడంలేదు. హీరోగా అవకాశాలు తగ్గడంతో విలన్ గా చేస్తున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి .. అయితే విలన్ గా చేయడానికి సిద్దమే అంటున్న రాజశేఖర్ కు విలన్ అవకాశాలు కూడా సరిగ్గా రావడం లేదు. అయితే తనకు బాలయ్య సినిమాలో విలన్ గా నటించాలని ఉందంటున్నారు రాజా శేఖర్. తాజాగా అయన నటించిన గరుడ వేగా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బాలయ్య గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తనకు హీరోగా అవకాశాలు తగ్గాయి .. అందుకనే విలన్ గా చేయటానికి సిద్ధమని చెప్పడంతో పాటు .. బాలయ్య సినిమాలో విలన్ గా నటించాలని ఉందని చెప్పాడు. మరి బాలయ్య జగపతి బాబుకు విలన్ గా అవకాశం ఇచ్చినట్టు రాజశేఖర్ కు కూడా ఇస్తాడేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments