నాకు ధైర్యం ఎక్కువంటున్న దీపికా !

Saturday, February 3rd, 2018, 02:30:36 AM IST

దాదాపుగా ఏ చిత్రం ఎదుర్కోనన్ని సమస్యలను దీపికా నటించిన పద్మావత్ ఎదుర్కున్న మాట నిజమనే చెప్పాలి. సినిమాలో ఎటువంటి వివాదాస్పద సన్నివేశాలు కానీ, డైలాగులు కానీ లేవని నేను మా యూనిట్ సభ్యుల ఎన్నిసార్లు చెప్పినా వివాదాలు మాత్రం ఆగలేదని, అయితే చివరకు చిత్రం విడుదలయి అన్ని చోట్ల విజయవంతం గా ప్రదర్శితమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని నటి దీపికా పడుకొనే ఒక ఇంటర్వ్యూ లో మాటాలాడుతూ అన్నారు. ఆమె మాట్లాడుతూ తనకు ధైర్యం చాలా ఎక్కువని, చిన్నప్పుడే 14 ఏళ్ళవయసులో ఒక వ్యక్తి కావాలని ప్రక్కనుండి తనను రాసుకుంటూ వెళ్లాడని, అయితే ఆగి మరీ ఆ వ్యక్తి చంప చెళ్ళు మనిపించానని చెప్పుకొచ్చారు. సినిమా విడుదలకు ముందు తన ముక్కు తెస్తే అన్ని కోట్లు, తల తెస్తే ఇన్ని కోట్లు అని కొందరు ప్రకటించినప్పుడు ఆమె స్పందించకుండా మౌనం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం పై ఆమె ఇప్పుడు స్పందిస్తూ అటువంటి బెదిరింపులకు భయపడేదాన్ని కాదని, తనకి తన ముక్కంటే చాలా ఇష్టమని, కాబట్టి వద్దు, తన కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, కావాలంటే తన రెండు కాళ్లలో ఒక కాలు తీసుకోమని చమత్కరించారు. అలానే ఆ చిత్రం లోని రాణి పద్మిని క్యారెక్టర్ గురించి ఆమె మాట్లాడారు. ఆమె ఏంతో గొప్ప వీరవనిత అని తన చేతిలో ఖడ్గం లేకపోయినా సరే తన మౌనంతో తోనే యుద్ధం చేయగలదని అన్నారు. తరువాత కూడా మరొక బయోపిక్ లో నటిస్తున్నానన్నారు. అందులో ముంబై మాఫియా క్వీన్ రహీమా ఖాన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సప్నా దీదీ అనే టైటిల్ ని నిర్ణయించినట్లు తెలుస్తోంది….