కలెక్టర్ పోస్టే బెస్టా..?

Monday, September 15th, 2014, 02:54:17 PM IST


సిఎం కుర్చీ ముళ్ళకిరీటం వంటిది.. ఇక సిఎం పేషీలో పని అంటే..ముళ్ళకంచేల మధ్య కూర్చునట్టే.. సిఎం పేషీలో పనిచేయాలంటే.. ఎంతటి ఉద్దండుడైనా కాస్త తటపటాయిస్తారు. కారణం ఒత్తిళ్ళు.. ఇప్పుడు ఇదే ఒత్తిడిని ఎదుర్కొంటున్నది స్మితాసభర్వాల్.. కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న స్మితా సభర్వాల్ ను ముఖ్యమంత్రి ఏరికోరి మరీ తన పేషీలో వేయించుకున్నారు. చేసే పనిలో చురుకుదనం చూపే స్మితా సభర్వాల్ ఇప్పుడు సిఎం పేషీలో అంత చురుకుదనాన్ని ప్రదర్శించలేకపోతున్నది. ఏదైనా ఒక పని కావాలంటే.. దానికి సంబంధించిన పైల్స్ ను వెంటనే తెప్పించుకొని ఆపనిని పూర్తిచేయడం కెసిఆర్ కు అలవాటు. కాని పలు కారణాల వలన సిఎం పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సభర్వాల్ తన పనిని సరియైన సమయంతో చేయలేకపోతున్నది. ఇందుకు పేషీలో ఒత్తిడిలే కారణమని తెలుస్తున్నది. అన్ని ఒత్తిడిల మధ్య ఆమె ఒక్కడ పనిచేలేకపోతున్నట్టు, తను తిరిగి కలెక్టర్ గానే వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం.