క్రికెట్ లో కొత్త రూల్స్.. జాగ్రత్త !!

Tuesday, September 26th, 2017, 03:14:58 PM IST


ప్రస్తుతం క్రికెట్ ఆట చాలా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి. టక్నాలజీ పెరిగిపోవడంతో వీక్షకులు కూడా చాల వరకు పెరిగారు. అందులోని ఆటలో రకరకాల మార్పులు జరగడం టి20 ఫార్మాట్ రావడంతో క్రికెట్ అభిమానులను మరింత దగ్గరైంది. ఆటగాళ్లు కూడా ప్రస్తుత రోజుల్లో చాలా ఫెమస్ అవుతున్నారు. ఐసిసి ఆటలో సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.

అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసిసి) మరో కొత్త తరహా రూల్స్ ని ప్రవేశపెట్టింది. గత కొంత కాలం నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్న ప్రయత్నాలకు రీసెంట్ గా ఫలితం దొరికింది. దీంతో ఈ నెల 28నుంచి ఆటలో కొన్ని రూల్స్ లో మార్పులు చేర్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ముందుగా రనౌట్ విషయంలో.. ఆటగాడు పరుగు తీసే సమయంలో డైవ్ చేస్తూ ఒకసారి తన బ్యాటును గ్రీసుకు టచ్ చేస్తే చాలు. ఆ తర్వాత పొరపాటున గాల్లోకి బ్యాటు లేచినా ఆటగాడు సేఫ్. ఎందుకంటే ఒకసారి గ్రీజ్ లో బ్యాట్ ని పెడితే చాలు.

అలాగే అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) లో ఐసిసి కొన్ని మార్పులు చేసింది. మొన్నటి వరకు వన్డే – టెస్టులల్లోనే అమలైన ఈ పద్ధతి ఇక టీ20 లోను అమల్లవ్వనుందని తెలిపింది. ప్రతీ ఇన్నింగ్స్ లో రెండు అన్ సక్సెస్ ఫుల్ రివ్యూలను మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. టెస్టుల్లో 80 ఓవర్లు దాటితే రివ్యూలకు అవకాశం ఉండదు. మరో ముఖ్యమైన రూల్ ఏమిటంటే ఆటగాళ్లు ఎవరైనా అనవసరంగా గొడవకు దిగినా కావాలనే కామెంట్స్ చేసినా అంపైర్ తో తప్పుగా ప్రవర్తించి ఎదురుచెప్పినా ఇక నుంచి గ్రౌండ్ లో నుండి బయటకు వెళ్లిపోవాల్సిందే. అంపైర్ కు కోపం తెప్పిస్తే ఆటగాడు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కఠినమైన నిర్ణయాలని ఐసిసి ప్రవేశపెట్టింది. ఈ రూల్ లెవెల్ 4 కిందకి వస్తాయి. .

  •  
  •  
  •  
  •  

Comments