ఈ నెలాఖరులో కరోనా తీవ్రతరం కానుందా…? హెచ్చరిస్తున్న ఐసీఎస్

Saturday, April 4th, 2020, 05:12:00 PM IST

ప్రపంచ దేశాలన్నింటిలో భయంకరంగా వ్యాపించి, ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను హరించినటువంటి భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్… భారత్ లో కూడా ఇప్పటికే చాలామందికి సోకింది. చాలామంది ప్రాణాలను తీసుకుంటుంది. అయితే కరోనావిర్స్ పుట్టి పెరిగిన చైనా లో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మిగతా దేశాల్లో విజృంభిస్తుంది. ఇకపోతే భారత్ లో ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడం వలన కొంత మేరకు నివారించగలిగినప్పటికీ కూడా, ఇటీవల ఢిల్లీలో జరిగిన మార్కాజ్ ప్రార్థనలకి హాజరైన వారి వలన ఈ వైరస్ ఇంకా చాలా మందికి సోకిందని సమాచారం.

ఇకపోతే ఈ భయంకరమైన వైరస్ వలన ఈ నెల చివరి నాటికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మరింతగా ఎక్కువయ్యే అవకాశం ఉందని, ఇంకా చాలా మరణాలు సంభవించే అవకాశముందని “ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ తెలిపింది” కొన్ని తీవ్రమైన హెచ్చరికలు చేస్తుంది. కాగా ఈ మేరకు ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ చీఫ్ క్రిస్టొఫర్మాట్లాడుతూ… “మనకి మరో నెల సమయం ఉంది. ఏప్రిల్‌ చివరి నాటికి లేక మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చు” అని వాఖ్యానించారు. అందుకనే ఇప్పటినుండైనా కూడా ఈ లాక్ డౌన్ చర్యల్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వాధికారులకు సహకరించాలని, లేకపోతె కరోనని ఎదుర్కోలేమని వెల్లడించారు.