ఇడియట్ బ్యూటీ కమ్ బ్యాక్!

Monday, May 21st, 2018, 11:22:57 PM IST

టాలీవుడ్ లో ఇడియట్ సినిమా గురించి తెలియని వారు ఉండరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రవితేజ కెరీర్ ను మలుపు తిప్పింది. డైలాగ్స్ ఇప్పటికి కూడా ఒక ట్రెండ్ సెట్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షితకి కూడా మంచి క్రేజ్ అందుకుంది. శివమణి – నిజం – అందరివాడు సినిమాలతో బాగానే బిజీ అయ్యింది. కన్నడ తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

అయితే కన్నడ దర్శకుడు అయినా ప్రేమ్ ని వివాహం చేసుకున్న తరువాత ఆమె చాలా వరకు సినిమాలకు ఎండ్ చెప్పేశారు. ఇక చాలా కాలం తరువాత ఆమె ఒక సినిమాకు పని చేశారు. తన భర్త దర్శకత్వంలో తెరకెక్కిన విలన్ సినిమాలో అమీ జాక్సన్ పాత్రకు రక్షిత డబ్బింగ్ చెప్పారట. ఆ పాత్ర చాలా కీలకమైంది కావడంతో రక్షిత చేత పట్టుబట్టి ప్రేమ్ చెప్పించినట్లు రక్షిత తెలిపింది. మొదటి సారి మరొకరికి డబ్బింగ్ చెప్పడం చాలా కొత్తగా ఉందని ఆమె తెలియజేశారు. ఇక ఆ సినిమాలో సుదీప్ – శివ రాజ్ కుమార్ వంటి అగ్ర నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments