ఇలానే సినిమాల్లో నటిస్తే బ్రతకలేనెమో అని మా ఊవూరెళ్ళిపోయా : జయప్రకాశ్ రెడ్డి

Wednesday, May 30th, 2018, 11:35:54 PM IST


క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయ ప్రకాష్ రెడ్డి తన జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు ఎదురుక్కున్నాను అని చెప్పారు. ఒకప్పుడు తాను స్టేజి మీద నాటకాలు వేసేవాడిని అని అన్నారు. గుంటూరు లోని జలగం రామారావు హై స్కూల్ లో సైన్స్ టీచర్ గా పని చేసిన ఆయన అనూహ్యంగా నాటకాల నుండి చిత్ర సీమలోకి ప్రవేశించారు. అయితే తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆర్ధిక పరిస్థితి కాస్త పర్వాలేదని అనిపించినప్పటికీ ఒక్కసారిగా అవకాశాలు రావడంతో దాదాపు ఒక పాతిక సినిమాల్లో నటించానని, అయితే దురదృష్టం కొద్దీ అందులో ఒక్క నిర్మాత కూడా తనకు సరిగ్గా పారితోషికం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తన టీచర్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టానని,

నిర్మాతలు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు తన కుటుంబాన్ని ఎంతో కష్టపడి పోషించానని అన్నారు. ఇంకా ఆ తరువాత ఇంకా కూడా ఈ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగితే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని తమ సొంత వూరు వెళ్లి, తన వృత్తిలో కొనసాగనని అన్నారు. అయితే ఆ ఐదేళ్ల సమయంలో తన నటనను గుర్తించి ఎవరూ కూడా మళ్ళి అవకాశం ఇవ్వలేదని, కేవలం సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు మాత్రమే తనలోని నటుడిని గుర్తించి తనను మళ్ళి సినిమాల్లోకి రమ్మన్నారని, కానీ తాను మాత్రం మళ్లి అప్పుల్లో కూరుకుపోవాలేమో అని భయంవేసి వెళ్లలేదని ఆయన చెప్పారు…….

  •  
  •  
  •  
  •  

Comments