డల్లాస్ ఈవెంట్: లిస్ట్‌లో పేరు లేకపోతే నో ఎంట్రీ..!

Monday, August 19th, 2019, 12:04:38 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి సారిగా అమెరికా పర్యటనకు వెళ్ళారు. అయితే అక్కడి తెలుగు అభిమానుల ఆర్గనైజేషన్లు కలిసి డల్లాస్‌లో జగన్ ప్రసంగించేందుకు పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే జగన్ రాకతో వేలాది మంది తెలుగు అభిమానులు రావడంతో డల్లాస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంట్రల్ హాల్ జనంతో కిక్కిరిసిపోయింది. అయితే తెలుగువారందరూ ఈ రేంజ్‌లో ఈవెంట్‌కు హాజరయ్యారంటే అక్కడ జగన్ క్రేజ్ ఎలా ఉందో పెద్దగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు చాలా మంది పాస్‌లు దొరకక హాల్ భయటే ఉండిపోగా, మరికొంత మంది పేర్లు లిస్ట్‌లో లేకపోవడంతో సిబ్బంది లోపలికి అనుమతించలేదు. అయితే ఏపీ నుంచి కూడా ఎంపీలు, మంత్రులు ఈవెంట్‌కి హాజర్‌కాగా వారి తరుపున వచ్చిన బంధువులను అక్కడి సిబ్బంది లిస్ట్‌లో పేరు లేకపోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు. అయితే వారు లోకల్ సిబ్బంది కావడంతో మంత్రులు కూడా లోపలికి వెళ్ళి ఈవెంట్ నిర్వాహకులను తీసుకువచ్చి మరీ వారి బంధువులను లోపలికి తీసుకువెళ్ళారంటేనే భద్రత ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. అయితే దీనిపై మంత్రులు, ఎంపీలు కాస్త అసహనానికి గురైనా అంత మంది ఉన్న దగ్గర భద్రత కూడా ముఖ్యమే కదా.