పవన్ అడుగు ఈ రోజు అసెంబ్లీలో పడి ఉంటే వేరేలా ఉండేది.!

Wednesday, June 12th, 2019, 01:37:54 PM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రవేశం ఇచ్చిన వెంటనే ఎలాంటి పోటీ కానీ పదవి కానీ ఆశించకుండా అప్పటి పరిస్థితుల రీత్యా తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చారు.అది ముగిసిపోయిన అధ్యాయం,ఇక ఆ తర్వాత తాను అనుకున్న విధంగా అటు రాష్ట్రంలోనూ మరియు కేంద్రంలోను పాలన జరిగే సూచనలు కనిపించకపోవడంతో ఇక సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయాల్సి వచ్చింది.

ఒక్కో సభ పెట్టి కేంద్రం నుంచి ఇక్కడ పార్టీ నేతలకు సహా చుక్కలు చూపించేవారు.ఇక సినిమాలు పూర్తయ్యాక ఆఖరు సంవత్సరంలో పూర్తిగా రంగంలోకి దిగేసారు.ఆ తర్వాత వారి పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాం అని చెప్పడం పవన్ కూడా భీమవరం మరియు గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చెయ్యబోతున్నానని ప్రకటించడం అన్ని జనసేన శ్రేణుల్లో ఒక సంచలనాన్ని రేపాయి.ఎవరు ఎన్ని అనుకున్నా సరే పార్టీ మొత్తం ఓడినా సరే ఈరోజు అట్టహాసంగా మొదలైన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలో పవన్ ఒక్కడి అడుగు అసెంబ్లీలో పడితే చాలు ఈసారి సమావేశాలు వరల్డ్ కప్ మ్యాచ్ చూసేంత రేంజ్ లో ప్రతీ ఒక్కరు చూస్తారు అని అంతా అనుకున్నారు.

కానీ సీన్ కట్ చేస్తే పవన్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.ముఖ్యమంత్రి అవ్వకపోయినా ఎమ్మెల్యేగా అయినా సరే పవన్ ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీ గొంతెత్తితే చూడాలని లక్షలాది మంది అభిమానులు అనుకున్నారు.కానీ కారణాలు ఏవైతేనేం మొత్తానికి పవన్ అడుగు మాత్రం పెట్టనివ్వకుండా మిగతా పార్టీల వారు గట్టిగానే కష్టపడ్డారని లేకపోతే ఈసారి అసెంబ్లీ సమావేశాలు వేరే స్థాయిలో ఉండి ఉండేవని జనసేన శ్రేణులు రాబోయే ఐదేళ్ల తర్వాత ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.