జనసేనతో వెళ్తే టీడీపీ సీన్ రిపీట్ అవుతుందా..?

Saturday, February 15th, 2020, 10:45:50 AM IST

ఇటీవలే ఏపీలో మూడో ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తన పార్టీ పటిష్టమైన నిర్మాణం కోసం జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అక్కడ నుంచి పవన్ బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు.అయితే ఇది ఏపీ రాజకీయాల వరకు మాత్రమే పరిమితం అయ్యింది.

ఈ పొత్తు మూలాన ఏపీలో రెండు పార్టీలకు సమానమైన లాభం ఉంటుందేమో కానీ తెలంగాణాలో మాత్రం అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తెలంగాణాలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇప్పుడు సిఏఏ మరియు ఇతర అంశాలను తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా పవన్ తో కూడా ప్రచారం చేయిస్తే ఎలా ఉంటుంది అని మరికొందరు అనుకుంటున్నారట.

కానీ ఇక్కడే పవన్ తో ఇక్కడ తాము ప్రచారం చేయించుకుంటే గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్ లు పెట్టుకున్న పొత్తులా భావించి తెలంగాణా ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారని మరి కొంతమంది బీజేపీ పెద్దలు సూచిస్తున్నారని తెలుస్తుంది.దానికి ఏపీ లీడర్ అయినటువంటి పవన్ ను తీసుకొచ్చి ప్రచారం చేయించడం కూడా తమ పార్టీకే నష్టం అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి తెలంగాణా బీజేపీ తుది నిర్ణయంగా ఏం చేస్తారో చూడాలి.