పెళ్లాడితే చంపేస్తాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!

Tuesday, June 26th, 2018, 03:45:02 PM IST

ఆరేళ్ల క్రితం ప‌వ‌న్ నుంచి రేణుదేశాయ్ విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఆ త‌ర‌వాత పిల్ల‌ల పెంప‌కంలో ప‌వ‌న్ ఆద‌ర్శం అంద‌రికీ న‌చ్చింది. అందుకే ప‌వ‌న్‌ని దేవుడిగా కొలిచే అభిమానులంతా రేణు దేశాయ్ తీసుకున్న తాజా నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ప‌వ‌న్ దేవుడు.. మీరు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం న‌చ్చ‌డం లేద‌ని ప‌వ‌న్ అభిమానులు రేణూపై డైరెక్టుగానే ఎటాక్ చేస్తున్నారు. కొంద‌రు ప్లీజ్ ప్లీజ్ ఈ పెళ్లి చేసుకోవ‌ద్దు అని అభ్య‌ర్థిస్తే, మ‌రికొంద‌రు అభిమానులు అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌! పెళ్లి చేసుకోవ‌ద్దు!! అని హెచ్చ‌రిస్తున్నారు. ఇదే విష‌యాన్ని రేణు దేశాయ్ స్వ‌యంగా ప‌లు ఇంట‌ర్వ్యూల్లోనూ చెబుతున్నారు.

ఇక తాజాగా ప‌వ‌న్ వ్య‌తిరేకి క‌త్తి మ‌హేష్ లైన్‌లోకొచ్చాడు. రేణు దేశాయ్ పెళ్లిని స‌మ‌ర్ధిస్తూ అభిమానుల అరాచ‌కాలు హ‌ద్దు దాటుతున్నాయ‌ని ప‌వ‌న్ మౌనంగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని క‌త్తి మ‌హేష్ వ్యాఖ్యానించాడు. ప‌వ‌న్ వెంట‌నే ఓకే చెప్పాల‌ని అన్నాడు. అయితే క‌త్తి అభిప్రాయంతో ప‌ని లేకుండానే ప‌వ‌న్ స్వ‌చ్ఛందంగానే రేణు పెళ్లిని స‌మ‌ర్ధిస్తూ సామాజిక మాధ్య‌మాల్లో స్పందించారు. దీంతో అభిమానుల‌కు ప‌క్కా క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఎన్ని క‌త్తులు ఝ‌లిపించినా ప‌వ‌న్‌ని ఎవ‌రూ ఏమీ అన‌లేని స‌న్నివేశం నెల‌కొందిప్పుడు. విడిపోయినా రేణు, పిల్ల‌లు బావుండాల‌నే ప‌వ‌న్ కోరుకున్నారు. ప్ర‌స్తుతం జ‌నంలో జ‌న‌సేనానిగా అత‌డికి పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డానికి కార‌ణాలు కూడా అవే. అయితే ప‌లువురు అత‌డి బ‌హుభార్య‌త్వం అన్న పాయింట్‌ని రాజ‌కీయాల‌కు వాడుకోవాల‌ని చూడ‌డం అభిమానుల్లో నిరంత‌రం చ‌ర్చ‌కొస్తోంది. ప్ర‌తిదీ రాజ‌కీయం చేసే ద‌గుల్భాజీ వ్య‌వ‌స్థ‌లో ప‌వ‌న్‌కి ఇంకా కొన్ని ఎటాక్‌లు త‌ప్ప‌వు. అయితే అత‌డు అన్నిటినీ స‌మ‌ర్ధంగా ఎదుర్కొంటున్నారు.