ఆ పెళ్ళిలో ప్రియాంక చెప్పుల ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Sunday, May 20th, 2018, 07:45:08 PM IST


బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం హిందీ చిత్రాలతో పాటు అక్కడక్కడా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ఇటీవల ది రాక్ సరసన బేవాచ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా ఏదైనా పార్టీలు, వేడుకలకు హాజరైనప్పుడు అందరికంటే ప్రత్యేకంగా కనపడాలని ఆమె ఎంతో జాగ్రత్తతో తన బట్టలను ఇతర వస్తువులను దగ్గరుండి డిజైన్ చేయిస్తుంటారు. కాగా నిన్న బ్రిటన్ యువరాజు హ్యారీ, హాలీవుడ్ నటి మార్క్లే ల వివాహానికి ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసారు. దాదాపు 600 మంది ముఖ్యమైన అతిధులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందులో డేవిడ్ బెక్ హాం, జార్జ్ క్లూనీ, ప్రియాంక చోప్రా సహా మరికొందరు హాజరయ్యారు. అయితే ఇక్కడే వుంది అసలు విశేషం. ఈ వేడుకకు విచ్చేసిన అందరి కళ్ళు ప్రియాంక పైనే వున్నాయట.

ప్రియాంక విచ్చేయగానే ఆమెను ఆహ్వానించడానికి మార్క్లే వచ్చారు. ఇద్దరు కలిసి నడిచివెళుతుండగా అతిదులందిరి చూపు ఎక్కువగా ప్రియాంక దుస్తులు, చెప్పుల వైపే ఉందట. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఆమె చెప్పులను అయితే ప్రతిఒక్కరు చూడసాగారట. నిజానికి వాటిని ప్రియాంక దాదాపు రూ.1.35 లక్షల రూపాయలు వెచ్చించి ప్రత్యేకంగా విదేశాల్లో ఈ చెప్పులు తాయారు చేయించారట. అవి చూసిన వారందరు ఆమెను ఎంతో అద్భుతంగా ఉన్నాయని పొగడ్తల్లో ముంచేశారట. ఎంతైనా ఒక విదేశీ పెళ్ళిలో మన నటి ప్రియాంక అందరి మనసులో దోచేలా అలంకరణ చేసుకుందంటే అది నిజంగా మన భారతీయ మహిళల గొప్పతనం అని చెప్పుకోక తప్పదు మరి…..

  •  
  •  
  •  
  •  

Comments