ఫ్రీ గా 2.0 టీజర్ ని 3D లో మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడాలా..?

Wednesday, September 12th, 2018, 10:23:37 AM IST

ప్రస్తుతం భారత దేశం అంతటా 2.0 టీజర్ జ్వరం పట్టుకుంది. ఒక పక్క తమిళ తలైవా వారి దైవంగా కొలుచుకునే సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు సగటు సినీ ప్రేమికుడు, వైవిధ్యమైన చిత్రాలు తీసే శంకర్ అభిమానులు ఒకవైపు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఐతే దానికి అనుగుణం గానే సమయం దగ్గర పడుతున్న కొద్దీ శంకర్ కూడా ఏదొక పోస్టర్ని కానీ ఆసక్తికర వార్తని కానీ తన ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.

ఐతే ఇప్పుడు కూడా శంకర్ 2.0 టీజర్ని 3D లో మీకు దగ్గరలో ఉన్న పీవీఆర్ థియేటర్స్ లో చూడండి అంటూ ట్వీట్ చేసారు. దీనికి గాను వారు ఎలాంటి డబ్బులు కట్టక్కరలేదు అని ఉచితంగా 3D లో థ్రిల్ ఎంజాయ్ చెయ్యండి అంటూ పెట్టారు. ఆలా చెయ్యాలి అంటే 9099949466 నెంబర్ కు ఒక్క మిస్సిడ్ కాల్ ఇచ్చి ఆ టికెట్ బుక్ చేసుకోమని చెప్పారు. కానీ అది ఏ రాష్ట్రానికి సంబందించిందో ఏంటి అనేది వివరించలేదు మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.

  •  
  •  
  •  
  •  

Comments