నిర్మాత `ప‌డ‌క సుఖం`పై నోరు జారిన ఇలియానా

Tuesday, March 13th, 2018, 09:39:11 PM IST

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప‌డ‌క సుఖం ఇప్పుడు అంద‌రి టార్గెట్‌. ఏ ప‌రిశ్ర‌మ అయితే అవ‌కాశాలిచ్చిందో అదే ప‌రిశ్ర‌మ‌పై నింద వేసేందుకు క‌థానాయిక‌లు ఏమాత్రం బిడియ‌ప‌డ‌డం లేదు. ముంబై నుంచి వ‌చ్చినా.. తెలుగమ్మాయి అయినా ఇదే పంథా. వివాదంతో ప్ర‌చారం తెచ్చుకోవ‌డంలో ఆర్జీవీ చూపించిన దారిలో వెళుతూ అవ‌కాశాలు వెతుక్కునే బాప‌తు ఎక్కువ‌య్యార‌న్న విమ‌ర్శ‌లు వెల్లుతున్నాయి. ఈరోజు పొద్దున్నే ఓ తెలుగ‌మ్మాయ్ కం యాంక‌ర్ టాలీవుడ్ నిర్మాత‌ల‌పై పెద్ద బాంబ్ పేల్చ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. టాలీవుడ్‌లో వాడుకుని వ‌దిలేసేవాళ్లే ఎక్కువ‌.. అంటూ పెద్ద బాంబ్ పేల్చింది. అయితే ఆ అమ్మ‌డి వ్య‌వ‌హారం మ‌రువ‌క ముందే తెలుగు సినిమా అగ్ర‌క‌థానాయిక‌గా రాజ్య‌మేలిన ఓ ముంబై బొమ్మ సౌత్ ఇండ‌స్ట్రీపై మ‌రో అణుబాంబ్ విసిరి క‌క్ష తీర్చుకుంది.

టాలీవుడ్‌లో ఓ అగ్ర‌నిర్మాత అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్న ఒక జూనియ‌ర్ ఆర్టిస్టును ప‌డ‌క సుఖం కోసం ర‌మ్మ‌ని అడిగాడ‌ని నిర్ల‌జ్జ‌గా చెప్పింది. ఇంత‌కీ ఎవ‌రీ అమ్మ‌డు? అంటే ఇంకెవ‌రో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. హాలీవుడ్‌లో వీన్‌స్టీన్‌తో పోలుస్తూ స‌ద‌రు నిర్మాత‌ను తూల‌నాడే ప్ర‌య‌త్నం చేసింది. ఇదో ర‌కంగా ఏరు దాటాక తెప్ప త‌గ‌లేయ‌డం అని విమ‌ర్శించాలా? లేక తెలుగులో అవ‌కాశాలిచ్చేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేర‌ని అటెన్స‌న్ డైవ‌ర్ట్ చేసినందుకో తెలీదు కానీ ఇలియానా హైద‌రాబాద్ వ‌స్తేనా? అంటూ ప‌ళ్లు నూరుతున్నార‌ని తెలుస్తోంది. లైంగిక వేదింపులు అన్న టాపిక్ రాగానే చెల‌రేగిపోవ‌డం ఇటీవ‌లి కాలంలో ముంబై భామ‌ల‌కు రివాజుగా మారింది. ఏదో ఒక పేరుతో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా టాలీవుడ్‌ని న‌లుగురిలో ప‌లుచ‌న చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? అని ఇలియానాని ప్ర‌శ్నిస్తున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments