ఇలియానా రీ ఎంట్రీ కాస్ట్ ఎంతో తెలుసా ?

Friday, May 25th, 2018, 03:15:02 PM IST

గోవా భామ ఇలియానా అంటే ఇప్పటికే సౌత్ ప్రేక్షకులకు ఓ క్రేజ్. తన నడుము అందాలతో రసిక హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ చాల గ్యాప్ తరువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. అక్కడ చేసిన రెండు మూడు సినిమాలు భారీ పరాజయాలను అందుకోవడంతో ఆమెకు కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా కోసం ఓ హీరోయిన్ గా ఇలియానాను అడిగారట .. కథ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందట .. కానీ దానికి భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టు టాక్ ? ఇంతకి ఇలియానా ఎంత డిమాండ్ చేసిందో తెలుసా .. అక్షరాలా రెండో కొట్లట !! అయితే దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పడంతో ఇలియానా తెలుగు రీ ఎంట్రీ కి ఓకే చెప్పిందట.

  •  
  •  
  •  
  •  

Comments