ఇలియానాకు అరుదైన‌ రోగం?

Tuesday, June 12th, 2018, 11:03:33 AM IST

స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానాకు అరుదైన రోగం ఉందా? అంటే అవున‌ని త‌నే స్వ‌యంగా అంగీక‌రించింది. కొంద‌రికి అతి శుభ్ర‌త రోగం ఎలా ఉంటుందో.. త‌న‌కు అతి జాగ్ర‌త్త అల‌వాటు అలానే ఉందిట‌. అతిగా త‌న అందం గురించి ఆలోచించేదానిన‌ని అంగీక‌రించిన ఇలియానా ఇటీవ‌లి కాలంలో అలాంటి అపోహ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డ‌ర్ అనే అరుదైన రోగం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని తెలిపింది.

అన్న‌ట్టు ఇలియానా ప్ర‌స్తుతం ఫిజీ దీవుల్లో సంచ‌రిస్తూ, అక్క‌డ టూరిస్టుల్ని ఆక‌ర్షిస్తోంది. ఫిజీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఆ దేశానికి విస్త్ర‌తంగా ప్ర‌చారం చేస్తోంది. ఫిజీలో స‌ర్ఫింగ్ గురించి ప్ర‌చారం చేస్తూ స‌ర్ఫింగ్ బోట్‌పై ఇల్లూ ఇచ్చిన ఫోజు రెచ్చ‌గొట్టింది. ఇదిగో ఇప్పుడిలా ఏకంగా స్కైడైవింగ్ చేస్తూ మ‌రోసారి ఆక‌ట్టుకుంటోంది. స్కై డైవ్‌కి ప్రిపేర‌వుతున్న ఇలియానా ఫోటోని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేసి కావాల్సిన ప్ర‌చారం చేసుకుంది. ఇక ఇలియానా కెరీర్ ప‌రంగా ప‌రిశీలిస్తే ఇటీవ‌లే అజ‌య్‌దేవ‌గ‌న్ స‌ర‌స‌న పీరియాడిక‌ల్ సినిమా `రెయిడ్‌`లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ త‌ర‌వాత పెద్దంత‌గా సినిమాలేం లేవ్‌!

  •  
  •  
  •  
  •  

Comments