షాక్.. ఇలియానా రహస్యంగా వివాహం?

Saturday, October 21st, 2017, 10:00:41 AM IST

ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్, గ్లామర్ హీరోయిన్ గా సౌత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. పెద్దగా అవకాశాలు రాకున్నా కూడా తన బాయ్ ఫ్రెండ్ తో జోరుగా షికార్లు చేస్తూ నానా హంగామా చేస్తున్న ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ అండ్రు నీబోన్ ని రహస్యంగా వివాహం చేసుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇలియానా కాస్త కొత్త పెళ్లి కూతురు గెటప్ లోకూడా కనిపించిందని, ఈ దీపావళిని అండ్రు తో కలిసి తెగ సంబరంగా జరుపుకుందని అంటున్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే ..అందుకే ఎవరికీ చెప్పకుండా కేవలం ఫ్యామిలి సభ్యుల మద్యే ఈ వివాహం జరిగి ఉంటుందని అంటున్నారు సినీ జనాలు. మరి ఈ విషయం గురించి ఈ అమ్మడు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments