ఫిజీ గ‌జ‌గ‌జ .. ఇల్లూ వైర‌స్ ఎఫెక్ట్‌

Sunday, June 10th, 2018, 11:39:32 AM IST

ఫిజీ దీవులో క‌ల్లోలం చెల‌రేగింది. దీవుల్లో హై ఎలెర్ట్ అలార్మ్ మార్మోగుతోంది. ఫిజీ టూరిజమ్‌ని గ‌జ‌గ‌జ ఒణికించిన ఆ వైర‌స్ పేరేంటి? అంటే.. టూరిజం అధికారులు `ఇల్లూ వైర‌స్` అని డిక్లేర్ చేశారు. ఇండియాలో నెబ్యులా వైర‌స్ ఎలానో, ఫిజీలో ఇల్లూ వైర‌స్ అలా అన్న‌మాట‌! ఇంత‌కీ ఈ వైర‌స్ ప్ర‌త్యేక‌త ఏంటి? అంటే.. చెక్ డీటెయిల్స్…

ఇంత‌కీ విష‌యం ఏమంటే ఇటీవ‌లే అందాల క‌థానాయిక ఇలియానాని ఫిజీ దేశం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకుంది. ఆ క్ర‌మంలోనే ఆ దేశ టూరిజంకి సంబంధించిన ప్ర‌చారంలో ఇలియానా బిజీబిజీగా ఉంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఫిజీ దీవుల్లో ఫోటోషూట్ల‌తో మంట‌లు పుట్టించింది. ఇక ప్ర‌స్తుతం స‌ర్ఫింగ్ పేరుతో ఫిజీ టూరిజానికి బోలెడంత బూస్ట్ ఇస్తోంది. సర్ఫింగ్‌పై ప్రేమాభిమానాలు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ సంద‌ర్శించాల్సిన ద్వీపం ఇది.. స‌ర్ఫింగ్ చేస్తే ఇక్క‌డే చేయాలి అంటూ ప్ర‌చారం చేస్తోంది. మొత్తానికి స‌ర్ఫింగ్ చేసే స్పెష‌ల్ వెహిక‌ల్‌పై ఇలా ఇసుక‌తిన్నెల్లో ఇల్లూ ఇచ్చిన ఫోజు ప్ర‌స్తుతం దీవుల్లోని టూరిస్టుల గుండెల్లో మంట‌లు పుట్టిస్తోంది. అందుకే ఇల్లూ వైర‌స్ అంత ప్ర‌మాద‌కరం అని డిక్లేర్ చేశారంతే!

  •  
  •  
  •  
  •  

Comments