వీడియో : ఇలియానా ఇలా కూడా చేస్తుంది!

Wednesday, April 25th, 2018, 09:34:54 PM IST

బాలీవుడ్‌లో ఇప్ప‌టికి ఏడు సినిమాల్లో న‌టించింది ఇలియానా. వీటిలో త‌న‌కు పేరు తెచ్చిన సినిమాలు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు తెచ్చిన సినిమాలు ఉన్నాయి. `బ‌ర్ఫీ` చిత్రం న‌టిగా పేరు తెస్తే, రీసెంటుగా రిలీజైన `రెయిడ్‌` క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌నిచ్చింది. ఆ క్ర‌మంలోనే వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త జీవితాన్ని బ్యాలెన్స్ చేసే ప‌నిలో ప‌డింది. ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌ని ఇప్ప‌టికే పెళ్లాడేసింద‌న్న ప్ర‌చారం ఉన్నా, దానిని ఇలియానా ఇంత‌వ‌ర‌కూ అంగీక‌రించ‌లేదు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌లే గ‌ర్భిణి అన్న ప్ర‌చారాన్ని మాత్రం తిప్పి కొట్టింది.

బాలీవుడ్ నాయిక‌గా త‌న‌కు ఉన్న క్రేజుతో ప‌లు రకాల బ్రాండ్ల‌కు ఇలియానా ప్ర‌మోష‌న్ చేస్తోంది. తాజాగా ఇలియానా ఖాతాలో మ‌రో కొత్త బ్రాండ్ చేరింది. ప్ర‌ఖ్యాత అమెరిక‌న్ టూరిస్ట‌ర్ ట్రావెల్ బ్యాగ్స్‌కి ఇల్లూ ప్ర‌చార‌క‌ర్త‌గా కొన‌సాగుతోంది. ఈ ప్ర‌క‌ట‌నకు సంబంధించిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో ఈ వీడియో జోరుగా వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments