గ‌ర్భ‌వ‌తిని కాను మొర్రో అంటోంది!

Saturday, April 21st, 2018, 11:11:32 PM IST

ఆస్ట్రేలియ‌న్ బోయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా స‌హ‌జీవ‌నం గురించి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారంపై బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. విదేశీ బీచ్‌ల‌లో ఫోటోషూట్లు మొద‌లు, ఆ ఇద్ద‌రూ భార్య‌భ‌ర్త‌ల్లా ఎంతో చ‌నువుగా ఉండ‌డంపై ఆధారాలు స‌హా బాలీవుడ్ మీడియా బ‌య‌ట‌పెట్టింది. రీసెంటుగా లిప్ లాక్ ఫోటోలు.. బాత్ ట‌బ్‌లో ఇలియానా స్నానం ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బంధం కేవ‌లం స‌హ‌జీవ‌నం వ‌ర‌కే కాదు, ఇదివ‌ర‌కే పెళ్లి కూడా అయిపోయింద‌న్న ప్ర‌చారం ఉంది. అయితే ఇలియానా మాత్రం త‌మ‌కు సంబంధించిన ఏ వ్య‌వ‌హారాన్ని బ‌హిరంగంగా ఒప్పుకోదు. అధికారికంగా ఏదీ ప్ర‌క‌టించదు… అంతా మీకే తెలుసు క‌దా! అంటూ దాట‌వేస్తూనే ఉంది.

గ‌త కొంత‌కాలంగా ఇలియానా గ‌ర్భ‌వ‌తి అంటూ మీడియా చాలానే ర‌చ్చ చేసింది. అయితే దీనిని వారం త‌ర‌వాత ఇన్నాళ్ల‌కు ఖండించింది. నేను గ‌ర్భ‌వ‌తిని కాను (నాట్ ఫ్రెగ్నెంట్‌) అంటూ సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసి ఆ ప్ర‌చారానికి ఫుల్‌స్టాప్ పెట్టించింది. బోయ్‌ఫ్రెండ్ నీబోన్‌తో అనుబంధం గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఇలియానా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది. మీకే అన్నీ తెలుసు క‌దా.. బ‌హిరంగంగానే చూస్తున్నారు క‌దా! అయినా ఇంకా ఇంకా ప్ర‌శ్న‌లు వేస్తూ ఎందుకు విసిగిస్తారు? అని ప్ర‌శ్నించింది.

  •  
  •  
  •  
  •  

Comments