రవితెజ కోసం మళ్ళీ ఇలియానా వస్తుందా ?

Monday, May 21st, 2018, 12:17:17 PM IST


మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న నేల టికెట్ ఈ నెల 25న విడుదలకు సిద్ధంగా ఉంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తరువాత రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని తీసుకోవాలని ప్లాన్ చేసారు. అందులో ఒక హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ ని ఎంచుకున్నారు. ఆమె కూడా ఓకే అన్న తరువాత మళ్ళీ ఏమైందో కానీ రీసెంట్ గా అను ఈ సినిమా నుండి తప్పుకుంది . డేట్ కుదరకే తప్పుకుంటున్నట్టు తెలిపింది అను. ఇక అను ప్లేస్ లో ఎవరిని పెట్టాలా అన్న ఆలోచనలో పడ్డ దర్శకుడు వెంటనే గోవా సుందరి ఇలియానా ను రీ ఎంట్రీ ఇప్పించాలని ఆలోచనలో పడ్డారట. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ ఇలియానా బాలీవుడ్ లో హీరోయిన్ గా వెలగాలని అక్కడికి వెళ్ళింది .. కానీ చేసిన సినిమాలు రెండు భారీగా పరాజయాలు కొట్టడంతో ఈ అమ్మడికి కొత్త అవకాశాలు కరువయ్యాయి. దాంతో మళ్ళీ సౌత్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ సినిమాలో ఇలియానా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకోవాలని చూస్తున్నారు . ఇప్పటికే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నారట.

  •  
  •  
  •  
  •  

Comments