ఫిజీ టూరిజం.. ఇలియానాకి బంప‌రాఫ‌ర్‌!

Thursday, March 22nd, 2018, 09:23:00 PM IST

ప‌ర్యాట‌కుల్ని విశేషంగా ఆక‌ర్షించాలంటే ఏం కావాలి? దేశం ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు అయ్యి ఉండాలి. సువిశాల‌మైన బీచ్‌లు, స‌ముద్రం ఉండాలి. ఎటు చూసినా ప‌చ్చందాలు.. ప‌డ‌తుల బికినీ సోయ‌గాలు అంతే ఇంపార్టెంట్‌! వేడి పెంచే ప్ర‌తి విష‌యం ఆదాయం పెంచుతుంద‌నేది టూరిజం శాఖకు తెలిసిన‌ ఏకైక‌ న‌గ్న‌స‌త్యం. అయితే ప్ర‌తి దేశం త‌మ దేశ ప‌ర్యాట‌కాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు విదేశాల్లో అవ‌స‌రం మేర బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ను నియ‌మించుకుంటారు. అలా ఇప్ప‌టికే ప‌లువురు టాప్ స్టార్లు టూరిజం శాఖ‌ల‌కు ప్ర‌మోష‌న్ చేశారు.

లేటెస్టుగా అందాల క‌థానాయిక ఇలియానాను ఫిజీ ఐల్యాండ్ దేశం ప‌ర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకుంది. ఆ మేర‌కు ఇలియానాతో ఒప్పందం చేసుకోవ‌డం విశేషం. వ‌చ్చే నెల‌లోనే ఇలియానా ఫిజీ దీవికి వెళ్లి అక్క‌డ ఎగ్జోటికా లొకేష‌న్ల‌లో ప‌ర్య‌టించ‌నుంది. అక్క‌డ ప‌లుచోట్ల త‌న‌పై ఫోటోషూట్లు, వీడియో షూట్లు ఉంటాయి. అలాగే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ను రూపొందించి రిలీజ్ చేస్తారు. ఇక‌పోతే ఇలియానా రాక‌తో త‌మ దేశం పావ‌నం కానుంద‌ని, టూరిస్టులు పెరుగుతార‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు ఫిజీ ప‌ర్యాట‌క మంత్రి ఫ‌యాజ్ సిద్ధిక్ కోయా. 40 శాతం ఇండియా రెజియ‌న్ ప‌ర్యాట‌కులు ఫిజీలో జాలీ ట్రిప్ వేస్తుంటారు. 2016తో పోలిస్తే 2017లో ప‌ర్యాట‌కం 30 శాతం పెరిగిందని ఫిజీ ప‌ర్యాట‌క మంత్రి వెల్ల‌డించారు. ఇలియానా ప్ర‌చారంతో ఆ శాతం పెరుగుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. మొత్తానికి బంప‌రాఫ‌ర్ ప‌ట్టేసిందే ఇల్లూ!