మళ్ళీ సౌత్ పై కన్నేసిన ఇలియానా ?

Tuesday, March 20th, 2018, 10:39:43 AM IST

హాట్ హాట్ అందాలతో సౌత్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న హాట్ భామ ఇలియానాకు బాలీవుడ్ లో చుక్కెదురైంది. అక్కడ హీరోయిన్ గా వెలగాలని తెగ ఆరాటపడి సౌత్ లో ఉన్న మంచి అవకాశాలను వదిలేసి వెళ్ళింది. బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలతోనే సరిపెట్టుకుని పరిస్థితి తెచ్చుకుంది. ఆమె చేసిన ఏ హిందీ సినిమా కూడా కెరీర్ పరంగా సరైన సక్సెస్ ఇవ్వలేకపోయింది. దాంతో ఖాళి సమయాల్లో తన బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ షికార్లు చేసిన ఈ అమ్మడి ఫోకస్ మళ్ళీ సౌత్ పై పడ్డట్టుంది. ఎందుకో తెలుసా ఈ మధ్య ఓ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సౌత్ లో హీరోయిన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారని, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారని అంటుంది. ఇంత సడన్ గా ఈ అమ్మడికి సౌత్ పై ఎందుకబ్బా అంత ప్రేమా అంటూ గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు. సో మొత్తానికి మళ్ళీ సౌత్ లో సినిమాలు చేయడానికి ఓ రకంగా హిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.