అవకాశాల కోసం అలా చేయనంటున్న గోవా భామ ?

Thursday, November 10th, 2016, 11:19:48 AM IST

ileana
అవకాశాలు ఇవ్వమని ఎవరిని అడగను, ఎవరి వద్దా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం నాకు లేదు అని చెబుతుంది హాట్ హాట్ అందాల గోవా భామ ఇలియానా !! టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ అడపా దడపా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈమెకు ”రుస్తుం” … సినిమా మంచి సక్సెస్ ని అందించింది. ఆ సినిమా తరువాత ఈ భామకు అవకాశాలు పెరిగాయి .. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలిసి ”బాద్షా” అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా తరువాత మారె అవకాశం రాలేదు .. దాంతో ఎందుకని అవకాశాలు రావడం లేదని అడిగితె .. ఇలా సమాధానం చెప్పింది హాట్ భామ. తనకు బాలీవడ్ సినిమాల్లో నటించడం అంటే ఆసక్తి అని చెప్పిన ఈ భామ మనదగ్గరికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలే కానీ, అవకాశాల కోసం అడుక్కోకూడదు అంటూ గట్టి షాక్ ఇచ్చింది.