నాకింకా పెళ్లి కాలేదు బాబోయ్ అంటున్న గోవా భామ ?

Wednesday, February 7th, 2018, 12:31:27 PM IST

గోవా భామ ఇలియానా పరిస్థితి మరి దారుణంగా తయారైంది. సౌత్ లో క్రేజీ అవకాశాలను వదులుకొని .. బాలీవుడ్ వెలగాలని తెగ ఆశ పడింది. కానీ ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకున్న ఈ భామకు విజయం మాత్రం దక్కలేదు. దాంతో అవకాశాల కోసం తెగ ఆరాటపడ్డ .. లాభం లేకపోయింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో ఒకే ఒక్క సినిమా మాత్రమే చేస్తుంది. తాజాగా ఇలియానా ఎక్కడికి వెళ్లిన పెళ్లి చూసుకున్నావా అంటూ అడుగుతున్నారని వాపోయింది. ఈ మధ్య ఆమె లవర్ అండ్రు తో తెగ ప్రేమ షికార్లు చేసిన ఈ భామ అతగాడితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవి వైరల్ అవడం కూడా జరిగాయి .. దాంతో పాటు ఇద్దరు కొన్ని రోజులు ఎక్కడ కనిపించలేదు .. అందుకే వీరిద్దరి కలిసి పెళ్లి చేసుకున్నారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం పై ఈ అమ్మడు స్పందిస్తూ .. బాబోయ్ నాకు పెళ్లి కాలేదు .. అయినా ఎవరికీ చెప్పకుండా ఎందుకు చేసుకుంటాను అని తెగ ఫీలయింది సన్న నడుము సుందరి ఇలియానా.