నేనే బోటు బయటకు తీస్తా… శివ

Saturday, September 21st, 2019, 02:00:29 AM IST

ఇటీవల బోటు ఏపీలో బోటు ప్రమాదం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. కాగా అందులో ఇప్పటికి కూడా కొందరి మృతదేహాలు లభ్యం కాలేదు. కొందరి మృతదేహాలు బోటు కింద ఇరుక్కుపోవడం వలన వాటిని తీయడం సాధ్యమవడంలేదని అధికారులు చెబుతున్నారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదలకు చెందిన సామాజిక కార్యకర్త బుల్ల వెంకట శివ, తనకు అవకాశం ఇస్తే కేవలం 2 గంటలలోనే ఆ బోటుని బయటకు తీస్తామని అంటున్నారు. ఈమేరకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తొలిసారిగా ఆ బోటుని గుర్తించింది తానేనని చెప్పారు. కానీ బోటు తీసేందుకు ప్రభుత్వాధికారులకు ఇష్టం లేదని అందుకనే తనని పంపించారని వెల్లడించారు. ఇకపోతే తనకు రెస్క్యూ చేసిన అనుభవం చాలా ఉందని, గతంలో కూడా ఒక లాంచీని లంగర్లు వేసి బయటకు తీసిన అనుభవంతో చెబుతున్నప్పటికీ కూడా అధికారులు తనని పట్టించుకోవడం లేదని వివరించారు శివ. కనీసం ఇప్పటికైనా శివ సహాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందో లేదో చూడాలి మరి…