టాప్ సీక్రెట్‌ : హ‌నీమూన్‌కి ఐల్యాండ్ జంప్‌?

Friday, October 20th, 2017, 11:08:08 AM IST

అక్కినేని నాగ‌చైత‌న్య – అక్కినేని స‌మంత జంట వివాహం గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మాలు ముగిశాయి. ఇక ఒక‌టే బ్యాలెన్స్‌. ఆ ఒక్క‌టి ఏంటో అంద‌రికీ తెలిసిందే. పెళ్లికి ముందు నుంచే చై-సామ్ జంట ఎన్నో క‌ల‌లుగన్న హ‌నీమూన్ గురించే ఇదంతా. పెళ్లి త‌ర్వాత 40 రోజుల పాటు ఎవ‌రికీ క‌నిపించం అని ముందే చెప్ప‌క‌నే చెప్పారు. అస‌లింత‌కీ ఈ కొత్త జంట ఎక్క‌డికి వెళుతున్నారు? హ‌నీమూన్ ఎక్క‌డ‌?

అన‌గ‌న‌గ ఒక అబ్బాయి.. అన‌గ‌నగా ఒక‌ అమ్మాయి.. ఓ దీవిలో చిక్కుకుపోయారు. అక్క‌డ పిట్ట కూడా లేదు. ఆ ఇద్ద‌రూ .. కీచుర‌ళ్ల శ‌బ్ధం.. స‌ముద్ర‌పుట‌ల‌ల చ‌ప్పుళ్లు త‌ప్ప ఇంకేవీ లేవ‌క్క‌డ‌. చుట్టూ కాకులు దూర‌ని కార‌డ‌వి మాత్రం ఉంది. అలాంటి చోట ఆ ఇద్ద‌రూ ఏం చేస్తారు? ఏం చేస్తారో మీరే ఊహించుకోండి. ప్ర‌స్తుతం అలాంటి ఎగ్జోటికా లొకేష‌న్‌లోకి వెళ్లిపోతున్నారుట నాగ‌చైత‌న్య – స‌మంత జంట. హ‌నీమూన్ కోసం సుదూర‌మైన దీవుల్లోకి జంప్ అయిపోతారుట‌. న్యూజిలాండ్ దీవుల్లో హాయిగా 40రోజుల పాటు ఎంజాయ్ చేసి వ‌స్తారుట‌. అయితే వెళ్లే ముందు వెళుతున్నాం అని మాత్రం చెప్పి వెళ‌తారో.. లేక అలానే వెళతారో.. ఏమో! ప్చ్‌!!

  •  
  •  
  •  
  •  

Comments