ఐమ్యాక్స్ లెన్స్‌లో ఏకైక 3డి మూవీ

Friday, April 6th, 2018, 09:38:16 PM IST


3డి సినిమాల వెల్లువ‌తో క‌ళ్ల ముందు అద్భుతాలు సాక్షాత్క‌రిస్తున్నాయి. సినిమా వ్యూయింగ్‌లో ప్రేక్ష‌కుల‌కు ఇదో అద్భుత అనుభ‌వం. మారుతున్న సాంకేతిక‌త‌లో 3డి సైతం కొత్త పుంత‌లు తొక్క‌నుంది. ఇక ఇన్నాళ్లు మ‌నకు 3డి సినిమా అన్న‌దే తెలుసు. కానీ ఈసారి ఇండియాలో అరుదుగా విన‌ప‌డే ఐమ్యాక్స్ 3డి కెమెరా అన్న ప‌దం తొలిసారి ఓ హాలీవుడ్ సినిమా వ‌ల్ల వినిపిస్తోంది.

ఇటీవ‌లే ట్రైల‌ర్‌తో ప్ర‌పంచాన్ని ఓ ఊపు ఊపేసిన ది గ్రేట్ `అవెంజ‌ర్స్ – ఇన్‌ఫినిటీ వార్‌` చిత్రం ఆద్యంతం ఐమ్యాక్స్ కెమెరాల‌తో తెర‌కెక్కించార‌ట‌. అంటే విజువ‌ల్‌గా ఇది మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఐమ్యాక్స్ 3డి థియేట‌ర్లు ప్ర‌పంచంలోనే చాలా త‌క్కువ‌. ఇండియాలో అయితే హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ అత్యంత ఫేమ‌స్‌. ఎలానూ ఐమ్యాక్స్ కెమెరాల్లో తెర‌కెక్కించిన సినిమా కాబ‌ట్టి ప్ర‌సాద్స్‌లో `అవెంజ‌ర్స్‌-2` చిత్రం వీక్షిస్తే అభిమానులు కొత్త అనుభూతికి లోన‌వ‌తార‌న‌డంలో సంద‌హం లేదు. ఐమ్యాక్స్ 3డి స్క్రీన్‌లో చూడాలంటే 3డి గ్లాస్ క‌లుపుకుని టిక్కెట్టు ధ‌ర రూ.250 వ‌ర‌కూ చెల్లించాల్సి ఉంటుంది. అవ‌తార్‌, బ్లాక్ పాంథ‌ర్‌, అవెంజ‌ర్స్, సూప‌ర్‌మేన్ స‌హా ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అన్ని రికార్డుల్ని ఈ సినిమా తిర‌గ‌రాస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈనెల 27న సినిమా రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments