బోల్తా పడ్డ మద్యం ట్రక్కు.. పండగ చేసుకున్న మందు బాబులు…!!

Tuesday, November 8th, 2016, 11:19:32 AM IST

truk
దేశ రాజధాని ఢిల్లీ లో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకు రోడ్లపై చమురు ట్యాంకర్ బోల్తా పడటం చూశాం కానీ మద్యం ట్రక్కు బోల్తా పడటం మాత్రం ఇదే బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. హరియాణాలోని ఝజ్జర్ ప్రాంతం నుంచి మద్యం లోడుతో వచ్చిన మినీ ట్రక్కు డివైడర్‌ను ఢీకొని తిరగబడింది. లోపల సరుకును జాగ్రత్తగా కాపాడాల్సిన డ్రైవర్.. అక్కడినుంచి పారిపోయాడు. మద్యం ట్రక్కు బోల్తా పడటంతో ఇంకేం అక్కడ స్థానిక ప్రజలు, రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు ఎచక్కా మద్యం బాటిళ్ళను సంచుల్లో, చేతిలో పట్టుకొని తీసుకెళ్లారు. అయితే ట్రక్కు బోల్తా పడడంతో డ్రైవర్ వెంటనే పారిపోయాడు. బహుశా హర్యానా లో అమ్మాల్సిన మద్యాన్ని ఢిల్లీ కి అక్రమంగా తరలించడం మూలంగానే డ్రైవర్ పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ట్రక్కు తిరగబడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని సీసాలు పగిలిపోయి మద్యం అక్కడ ప్రవహించడంతో మందుబాబులు బాధపడ్డారు. వాసన గుర్తించిన ఒకరిద్దరు బైకర్లు మిగిలిన సీసాలు తీసుకెళ్తుండటంతో.. ఇంకా చాలామంది వచ్చి తమకు దక్కింది తీసుకున్నారు.