మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్దుల ప్రచారానికి ఇంకా ఒక్క రోజే సమయం ఉండటంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. అయితే ఈ ఎన్నిక తెలంగాణ రాష్ర్టం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరగుతున్న తొలి ఉప ఎన్నిక.. కామన్ గానే అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే పరిస్దితి ఇప్పుడు మెదక్ లోనూ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అయితే మెదక్ లో ముస్లీం మైనారీటీల ఓటు బ్యాంక్ తో పాటు ఎస్సిల ఓట్లు కీలకంగా మారాయి.
టిఆర్ఎస్ అదికారంలోకి వస్తే ముస్లీం మైనారీటీల వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి ని చేస్తానని 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇంకా ముస్లీం మైనారీటీలకు అనేక సౌరకర్యాలు కల్పిస్తామని టిఆర్ఎస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ బాస్ ప్రస్తుత తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో ఒకటి మహముద్ ఆలిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. 12 శాతం రిజర్వేషన్లపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటానని రంజాన్ పర్వదినాన ప్రకటించారు. ఇంకా కాస్తా ముందుకు వెళ్లి ముస్లీం అమ్మాయిల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం క్రింద గతంలో ఇచ్చే 25 వేల రూపాయలను 51కి వేయి రూపాయలకు పెంచారు. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనారీటీలకు ప్రకటించిన పధకాలు
మరో వైపు ఎంఐఎం పార్టీ కూడా మెదక్ ఎన్నికలల్లో అభ్యర్దిని రంగలోకి దింపక పోయీనా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానని ప్రకటించలేదు. దీనితో వారి మద్దతు కూడా దాదాపుగా టిఆర్ఎస్ పార్టీకే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు ఎలాగూ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలుండవు. మరో వైపు దేశంలో, రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టి పరిస్దితి బాగా లేదు. ఈ పరిస్దితిలో వారు కూడా టిఆర్ఎస్ కు ప్రత్యక్షంగానో… పరోక్షంగానో మద్దతు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందులో ప్రధానంగా త్వరలో జరుగబోయే గ్రేటర్ హైద్రబాద్ నగర పాలక ఎన్నికల్లో టిఆర్ఎస్.. ఎంఐఎం పార్టిలు ఒకరికి ఒకరు సహకారంతో రంగంలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్దితుల్లో డిప్యూటి సిఎం మహముద్ అలి కూడా మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈయనతో పాటు ఇతర ముస్లీం మైనారీటీ నేతలను కూడా రంగలోకి దింపారు.