ఆ విషయం లో పవన్ కళ్యాణ్ మరియు జూ.ఎన్.టీ.ఆర్ లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Wednesday, September 5th, 2018, 01:30:05 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్.టి.ఆర్ పరిచయం అవసరం లేని పేర్లు. ఎవరు వారి శైలి లో వారి వారి పంథా లో ఎప్పటికప్పుడు వారి అభిమానులని అలరించాలని ఎల్లా వేళలా ప్రయత్నిస్తుంటారు. ఎన్నో రికార్డులు తిరగరాయగల సత్తా ఉన్న నటులు వీరు అంతే కాకుండా ఎంతో మందికి ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు వీరిని ఇప్పుడు వీరి ఇద్దరికీ బాగా చేరువగా ఒక సంఘటన కలుపుతుంది. అది వారి యొక్క ఉన్నతమైన స్వభావాన్ని మరియు అభిమానులు పట్ల ఉన్న ప్రేమని, నిర్మాతల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియాజేస్తాయి..

ఈ ఇరువురి యొక్క ఉన్నత స్వభావాన్ని కలిపే సంఘటనే ఈ మధ్య నందమూరి వారి కుటుంబం లో విషాధ సంఘటన ఆ మధ్య కారు ప్రమాదం లో శ్రీ నందమూరి హరికృష్ణ గారు స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అయితే ఈ కొద్దీ రోజుల్లోనే మళ్ళీ జూ ఎన్.టీ.ఆర్ గారు త్రివిక్రమ్ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం “అరవింద సమెత వీర రాఘవ” ఇలాంటి విషాద పరిస్థితుల్లోనూ ఎన్.టీ.ఆర్ గారు వారి బాధ అంతటిని దిగమింగుకొని తన అభిమానుల కోసం నిర్మాతలుకు ఎలాంటి నష్టం రాకూడదని తిరిగి మళ్ళీ షూటింగుకు హాజరు అయ్యారు. గతం లో కూడా ఇదే త్రివిక్రమ్ గారి దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ నటించిన “జల్సా” చిత్రం షూటింగ్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తండ్రి చనిపోయినా కూడా తన అభిమానులు నిర్మాతల కోసం ఆ బాధను తన లోనే ఉంచుకొని షూటింగుకు హాజరు అయ్యారు..

ఈ రెండు సంఘటనల ద్వారా వారి యొక్క ఉన్నతమైన స్వభావాన్ని వ్యక్తపరుచుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments