ఈ విషయంలో వైసీపీ కంటే టీడీపీ ప్రభుత్వమే బెటరా..?

Sunday, August 18th, 2019, 12:31:46 PM IST

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏమో కానీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వారి పార్టీకు కొత్త కొత్త చిక్కులు సమస్యలు వచ్చి పడుతున్నాయి.జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే కృష్ణా జలాలు పొంగి అనేక ప్రాంతాలు మునిగిపోయాయని ఇతర పార్టీల వారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటే.ఇప్పుడు ఏపీ ప్రజల మదిలో ఒక ప్రశ్న మెదిలింది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వమే కాస్త బెటర్ అనే అభిప్రాయాన్ని చాలా మంది వెల్లడిస్తున్నారు.

ఎందుకంటే గత కొన్ని రోజులు నుంచి ముంపు ప్రాంతాలలో ఉన్న జనం అసలు ఎలాంటి సహాయక చర్యలు అందక మగ్గిపోతున్నారు.స్థానిక ఎమ్మెల్యేలు కూడా అసలు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.ఇదిలా ఉండగా ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు మాత్రం సహాయక చర్యల్లో వైసీపీ కంటే చంద్రబాబు ప్రభుత్వమే కాస్త వేగంగా స్పందించింది అని అంతే కాకుండా ఇలాంటి సమయాల్లో ముందుగానే వారు అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి.

దీనికి ఉదాహరణగా విశాఖలో వచ్చిన హుదూద్ తుఫాను సహాయక చర్యలను చెప్పొచ్చు కానీ శ్రీకాకుళంలో వీరు చేసిన డబ్బా రాజకీయాలు మాత్రం ఎవరు మర్చిపోరు.కనీసం ఇలా అయినా సరే వైసీపీ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలం అయ్యిందని తెలుగుదేశం అధిష్టానం వైసీపీ పై మండిపడుతుంది.