టిఆర్ఎస్ ఎమ్మెల్యే వద్ద రూ 100 కోట్ల అక్రమాస్తులు !

Friday, January 20th, 2017, 04:16:29 PM IST

trs-leader
మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు.వందలాది కోట్ల రూపాయల అక్రమాస్తులను కలిగి ఉన్నారన్న సమాచారంతో కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన ఆదాయపు పన్ను విభాగం అధికారులు దాడులు నిర్వహించారు.కర్ణాటన లోని రాజేంద్ర రెడ్డి కి చెందిన విద్యాసంస్థల పై ఐటి అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. 2015 లోనే ఐటి అధికారులు రాజేంద్ర రెడ్డి కి చెందిన లెక్కచూపని కొన్ని వందల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ కేసు కర్ణాటక లోని రాయచూర్ కోర్టులో విచారణలో ఉంది. ఐటి అధికారుల వద్ద రాజేద్ర రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. కాగా ఈనెల 5 న ఆయన విచారణకు హాజరై షూరిటీ సమర్పించినట్లు సమాచారం. కాగా రాజేంద్ర రెడ్డి గత ఎన్నికల్లో టిడిపి తరుపున విజయం సాధించారు. అనంతరం అయన టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.