బ్రేకింగ్: మై హోం రామేశ్వరరావు ఇంటిపై ఐటీ దాడులు..!

Thursday, July 4th, 2019, 09:30:14 PM IST

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇళ్లలో మరియు ఆయనకు సంబంధించిన కార్యాలయాలలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి నందగిరిహిల్స్‌లోని రామేశ్వరరావు ఇంట్లో ఆదాయపన్ను అధికారులు తనిఖీ చేస్తున్నారు. సోదాల్లో వందమందికిపైగా అధికారులు పాల్గొంటున్నారు.

అయితే ఆయన ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆయన ఇంటిపై దాడులు సాధారణ తనిఖీలలో భాగంగానే జరుగుతున్నాయా? లేకపోతే మరో ఉద్దేశం ఏమైనా ఉందా అని రాజకీయవర్గాలలో ఇప్పుడు పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. అయితే రెండేళ్ల కిందట కూడా రామేశ్వరావు ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల 10టీవీ టీవీ9, మోజో టీవీను కొనుగోలు చేసిన కారణాల వలనే అధికారులు దాడులు నిర్వహించి ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు.