బిగ్ న్యూస్: బ్రెజిల్ ను దాటేసిన భారత్…చర్యలు తీసుకోకపోతే ఇంకా దారుణ పరిస్తితులు!

Monday, April 12th, 2021, 01:04:39 PM IST

Corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్ష కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం తో దేశ ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయిన దేశాల్లో భారత్ ప్రస్తుతం రెండవ స్థానం లో ఉంది. గడిచిన 24 గంటల్లో 1,62,912 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ భారత్ లో 1,35,27,717 మందికి కరోనా వైరస్ సోకింది. అయితే అమెరికా లో ఇప్పటి వరకూ 3,19,18,591 మందికి కరోనా వైరస్ సోకింది.

అయితే అమెరికా తర్వాతి స్థానం లో మొన్నటి వరకూ బ్రెజిల్ ఉండగా, ఇప్పుడు ఆ స్థానం లోకి భారత్ చేరింది. బ్రెజిల్ లో ఇప్పటి వరకూ 1,34,82,543 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. అయితే మరణాల్లో సైతం భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. అమెరికా లో 5,75,829 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోగా, బ్రెజిల్ లో 3,53,293 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోయారు. మెక్సికో లో ఇప్పటి వరకూ 2,09,212 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య లక్ష 70 వేలకు చేరింది. అయితే పరిస్తితి చక్కబెట్టేందుకి పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ను ఎంచుకోగా, ఇంకా కొన్ని రాష్ట్రాలు ఆలోచనలో ఉన్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని పై త్వరలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.