9 ఏళ్ల తరువాత ఆ దేశంతో కోహ్లీ సేన..

Wednesday, January 10th, 2018, 08:30:07 PM IST

ప్రస్తుతం దక్షిణాఫ్రికా తో టీమ్ ఇండియా టెస్టు సిరీస్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా గెలుస్తుంది అనుకున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ సేన పరాజయం చెందడంతో ఇప్పుడు రెండవ టెస్టుతో గెలిచి సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కోహ్లీ సేన ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కు బిసిసిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఈ సిరీస్ జరుగుతుందా లేదా అని ఊహాగానాలు అనేక విధాలుగా వచ్చాయి. ఇప్పటివరకు ఐర్లాండ్ కేవలం భారత్ తో ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడింది. 2009 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఈ దేశాలు తలపడ్డాయి. ఇకపోతే చాలా ఏళ్ల తరువాత భారత్ ఐర్లాండ్ కు వెళ్లనుంది. జూన్‌ 27 – 29 తేదీలలో రెండు టీ20 మ్యాచ్ లను ఆడనుంది. ఇక ఆ తరువాత కోహ్లీ సేన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

  •  
  •  
  •  
  •  

Comments