ఇండియానే చాంపియన్స్ ట్రోపీ విజేత

Monday, June 24th, 2013, 08:57:43 AM IST


చాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో అమీ తుమీ తేల్చుకోవడానికి ఇండియా – ఇంగ్లాడ్ జట్లు సిద్దమయ్యాయి. కానీ వరుణుడు అడ్డుకోవడంతో మ్యాచ్ కి కాసేపు అంతరాయం కలిగింది. అలాగే లైటింగ్ తక్కువగా ఉండడంతో క్రికెట్ యాజమాన్యం వన్డే మ్యాచ్ ని కాస్తా కుదించి ట్వంటీ 20 గా మార్చింది. వరుణుడు దెబ్బకి పిచ్ ఇంగ్లాండ్ కి అనుకూలంగా మారడంతో బౌలర్స్ రెచ్చిపోయి మన ఇండియన్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేసారు. దాంతో ఇండియా చాలా నిదానంగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసి 130 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ఇండియా టీంలో కోహ్లీ 43 పరుగులు చేయగా జడేజా 33 పరుగులు చేసాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ మొదటి నుంచి ఫాస్ట్ గా ఆడుతూ 16 ఓవర్లకి 110 పరుగుచేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోవడంతో ఇక ఇండియాకి ట్రోఫీ చేజారిపోయినట్టే అనుకున్నారు కానీ అప్పుడే మన టీంలో ఏదో తెలియని ఓ ఫైర్ దాంతో మరో నాలుగు ఓవర్లు ముగిసేసరికి 124 పరుగులకి 8 వికెట్లని తీసి ధోనీసేన విజేతగా నిలిచింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ ని ఓడించి ధోనీసేన చాంపియన్స్ ట్రోపీని కైవసం చేసుకుంది.