ఇండియా – పాక్ యుద్ధం ఆటలు మొదలు

Tuesday, September 27th, 2016, 05:22:14 PM IST

war
ఒకపక్క యుద్ధం ఒద్దు అంటూనే భారత వైమానిక సత్తా ఎంతటిదో పాకిస్తాన్ కి చూపించాలి అని భారత్ ముచ్చట పడుతోంది. శ్రీనగర్ నుంచి రాజస్థాన్ దాకా భారీ ఎత్తున సైనిక, వాయు విన్యాసాలకి అంతా సిద్దం చేస్తున్నారు భారత దళపతులు. భారత వాయుసేన ప్రధాన కమాండ్ సహా, పశ్చిమాన ఉన్న 18 ఎయిర్ బేస్ లతో పాటు పూర్తి స్థాయి యుద్ధ విమానాలు, చాపర్లతో ఈ విన్యాసాలు ఉంటాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని భావించిందని, అందుకోసం సరిహద్దుల్లో ‘ఎక్సర్ సైజ్ తాలోన్’ పేరిట నాలుగు రోజుల పాటు వార్ గేమ్స్ ఆడనుందని ఓ అధికారి వివరించారు. ఎయిర్ కమాండ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. యూరీ లో ఆర్మీ మీద జరిగిన ఉగ్రదాది తరవాత భారత్ పాక్ మధ్యన ఉద్రిక్త పరిస్థితి పెరిగింది , ఎలాంటి పరిస్థితి లో అయినా మన విమానాలు సంనధంగా ఉన్నాయి అని పరీక్షించడం కోసం ఈ విన్యాసాలు జరుగుతాయి అంటున్నారు. ఇది వీక్షించడం కోసం కేంద్ర మంత్రులు సైతం రాబోతున్నారు. కావాలనే సరిహద్దుల్లో భారత్ ఈ ఆటలు సిద్దం చేస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఈ ప్రోగ్రాం ని నిశితంగా పరిశీలించబోతోంది కూడా .

  •  
  •  
  •  
  •  

Comments