మోదీతో పెట్టుకుంటున్న `ప‌ద్మావ‌తి` స‌పోర్ట‌ర్స్‌!!

Monday, November 13th, 2017, 01:36:18 PM IST

భ‌న్సాలీ `ప‌ద్మావ‌తి` వివాదాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న వేళ ముప్పిరిగొలుపుతున్న‌ వివాదాలు భ‌న్సాలీ అండ్ టీమ్‌ని డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విష‌యంలో ప‌ట్టుద‌ల‌గా ముందుకు సాగుతున్నారు. ఉత్త‌రప్ర‌దేశ్‌, తెలంగాణ స‌హా ప‌లు ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్‌పై ఇప్ప‌టికే నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. రాజ్‌పుత్ క‌ర్ణిసేనలు, హిందూ సేన‌లు రిలీజ్‌ని ఆపేందుకు శ‌త‌ధా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఆ మేర‌కు నిన్న‌టిరోజున ప్ర‌ముక భాజ‌పా ఎమ్మెల్యే న‌రేంద్ర మోదీకి లేఖ రాయ‌డం సంచ‌ల‌న‌మైంది.

అయితే ఇలా సినిమాల్ని, క‌ళ‌ను రాజ‌కీయం చేయ‌డంపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయాలు చేసి ఇలా సినిమాని నాశ‌నం చేయ‌డంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఆ మేర‌కు నిన్న‌టిరోజున ఆయ‌న ఓ వీడియో సందేశాన్ని పంపించారు. మ‌న‌ల్ని కుహానా రాజ‌కీయ‌నాయ‌కులు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా? ఎదుర్కొందామా? అంటూ ఆయ‌న సీరియ‌స్‌గానే ఎటాక్ చేశారు. “ఇది కేవ‌లం భ‌న్సాలీకి ఒక్క‌రికే చెందిన‌ స‌మ‌స్య కాదు. అంద‌రిదీ. నీచ రాజ‌కీయాల వ‌ల్ల‌ ఫిలింమేక‌ర్స్ నావ‌న‌మ‌వుతున్నారు.. ఇక‌ముందూ ఇలానే మ‌న‌మంతా (మేక‌ర్స్‌) త‌ల వొంచుదామా?“ అంటూ కామెంట్ చేశారు క‌ర‌ణ్‌. ఆ క్ర‌మంలోనే ఇండియ‌న్‌ సినీ,టీవీ ద‌ర్శ‌కుల సంఘం (ఐఎఫ్‌టిడిఏ) భ‌న్సాలీకి బాస‌ట‌గా నిలుస్తూ సంఘీభావం తెలిపింది. ప‌ద్మావ‌తి రిలీజ్‌కి అండ‌గా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఆ మేర‌కు నేటి ఉద‌యం ముంబై -జుహూలో ఓ స‌మావేశం నిర్వ‌హించింది. కొన్ని ప్ర‌మాద‌క‌ర శ‌క్తుల వ‌ల్ల సినిమా నాశ‌నం అవుతుంటే చూస్తూ ఊరుకోకూడ‌ద‌ని ఈ స‌మావేశంలో ద‌ర్శ‌కులంతా నిర్ణ‌యించుకున్నారుట‌. అంతా ఏక‌మై తిప్పికొడ‌దామ‌ని నిర్ణ‌యించ‌కున్నార‌ని తెలుస్తోంది. ఇది ప్రోత్స‌హించ‌ద‌గ్గ శుభ‌ప‌రిణామ‌మే. అయితే ప‌ద్మావ‌తి రిలీజ్‌ని ఆపాల‌నుకుంటున్న‌ది సాక్షాత్తూ మోదీ ప్ర‌భుత్వ‌మే అయితే దానిని ఎలా ఎదిరిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments