ఆస్ట్రేలియా పట్టాలపై పరిగెత్తనున్న భారత భోగీలు..!

Friday, January 29th, 2016, 07:05:06 PM IST


ఆస్ట్రేలియా కోసం భారత్ లో తయారైన ఆరు మెట్రో కోచ్ లు ఈరోజు ముంబై పోర్టు నుండి ఆస్ట్రేలియా కు ఎగుమతయ్యాయి. ఈ కోచ్ లను బరోడాలో తయారుచేశారు. ఆస్ట్రేలియాతో భారత్ మొత్తం 450 మెట్రో కోచ్ లను ఎగుమతి చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే ఈరోజు మొదటి విడతగా 6 కోచ్ లను ముంబై పోర్టు నుండి ఎగుమతి చేసింది.

ఈ భారీ కోచ్ లను హ్యాండిల్ చేయడానికి ముంబై పోర్టు భారీ ఏర్పాట్లు చేసుకుంది. ఈ కోచ్ లు ఒక్కొక్కటి 76 అడుగుల పొడవు.. 46 టన్నుల పొడవుండటంతో వీటిని పైకెత్తి ఓడలలో లోడ్ చేయడానికి భారీ క్రేన్లను ఉపయోగించారు. దీనిపై మాట్లాడిన కోచ్ నిర్మాణ సంస్థ సంబందిత అధికారులు భారత టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందనడానికి ఇదొక నిదర్శనం అన్నారు.