భారతీయుల కోసం సౌదీలో హెల్ప్ లైన్స్ ఏర్పాటు

Saturday, June 8th, 2013, 09:20:19 PM IST


సౌదీ అరేబియలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను, ఇతర దేశాలకు చెందిన వారిని శిక్షించకుండా వదిలేయదని అక్కడి ప్రబుత్వం అంగీకరించింది. అయితే అక్కడి నుండి వారు ఇక్కడికి రావడం కోసం భారత ప్రభుత్వం సౌదీ అరేబియాలోని ఘమేషి తార్ హీల్, రియాద్ అంతర్జాతియ విమానాశ్రయాలలో కొన్ని హెల్ప్ లైన్స్ ని ఏర్పాటును చేయనుంది. ఈ హెల్ప్ లైన్స్ ద్వారా భారతీయులు భారత్ చేరుకోవడానికి కావలసిన సమాచారాన్ని అందిస్తాయి. ఈ రోజు నుండి ఈ హెల్ప్ లైన్ సేవలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ సంచార హెల్ప్ లైన్ కేంద్రాల సేవలు 24 గంటలు పనిచేస్తాయి. ఈ సెంటర్స్ లో అరబిక్ మాట్లాడే అధికారులు ఉంటారని, ఇప్పటికే ఒక హెల్ప్ లైన్ తమ ఆఫీసులో పనిచేస్తుందని భారత ఎంబసీ తెలియజేసింది. ఈ హెల్ప్ లైన్ కేంద్రాల నంబర్స్ : 0546843866, 0546843894, 0546843836, 0546843746, 0546843903