క్రైమ్ కహాని : భారీ బడ్జెట్ తో నిర్మాత డ్రగ్ రాకెట్..బాంబు పేలిన చోట లాడెన్ ఫోటో..!

Wednesday, November 2nd, 2016, 07:53:06 PM IST

crime-kahani
డ్రగ్ రాకెట్..భారీ బడ్జెట్ గురూ.. : 1-1డైరెక్టర్ అఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డి ఐ ఆర్) అధికారులు దేశం లోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. 23,500 కిలోల మాండ్రక్స్ ట్యాబ్లేట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ 4700 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ డ్రగ్ మాఫియాతో బాలీవుడ్ నిర్మాత సుభాష్ డూడానికి కూడా సంబందం ఉంది.దీనితో అధికారులు అతడిని అరెస్ట్ చేసారు.రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశం లోని అతిపెద్ద డ్రగ్ రాకెట్ ఇదే అని అధికారులు అన్నారు.

2-1

నాభర్త అలాంటివాడని తెలియదు : ఓర్లాండో లో గే నైట్ క్లబ్ లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 50 మందికి పైగా ప్రాణాలు పొట్టనపెట్టుకున్న నిందితుడు ఒమర్ మతీన్ ఇంతదారుణనికి ఒడికడతాడని తాను ఊహించలేదని అతడి భార్య నూర్ సల్మాన్ తెలిపింది.న్యూ యార్క్ టైమ్స్ ఇంటర్వ్యూ లో ఈ విషయాలను ఆమె వెల్లడించింది.తన భర్త ఎప్ప్పుడూ చెడుగా ప్రవర్తించేవాడని, కానీ ఇంత దారుణానికి ఒడి కడతానని తాను ఊహించలేదని అతడి భార్య తెలిపింది.తన భర్త చర్యలకు క్షమాపణలు చెప్పినా తక్కువే అని తెలిపింది.

బాంబు పేలిన చోట లాడెన్ ఫోటో : 3మంగళవారం కేరళలోని మలప్పురం కోర్టు ఆవరణలో బాంబు పేలిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా ఒకరు గాయపడ్డారు. దీనితో బాంబు స్క్వాడ్ రంగం లోకి దిగి సోదాలు చేయడా దుండగులు ప్రెజర్ కుక్కర్లో బాంబు అమర్చి పేల్చినట్లు తేలింది. అలాగే ఘటన స్థలం లో కారుడు కట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫోటో దొరకడం ఆశ్చర్యానికి గురిచేసింది.దీనిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.