ముంబై భామలపై కౌంటర్ వేసిన.. ఇంద్రజ ?

Sunday, January 29th, 2017, 01:05:36 PM IST

indhraja
సినిమాల్లో స్టార్స్ అంటే కేవలం ముంబై హీరోయిన్స్ అని అనుకోవొద్దని, సౌత్ హీరోయిన్స్ కూడా వారికీ తగ్గట్టుగా ఉన్నారంటూ కామెంట్ చేసింది నాటి హీరోయిన్ ఇంద్రజ? ముంబై హీరోయిన్స్ కు గ్లామర్ పాళ్ళు ఎక్కవ ఈ విషయంలో దక్షిణాది అమ్మయిలు పోటీ పడడం లేదని నా అభిప్రాయం. అయితే నటన విషయంలో ఏమాత్రం తక్కువ కాదు అని అంటుంది. సౌత్ వాళ్లకు సరైన అవకాశాలు రావడం లేదంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెబుతున్న ఈ అమ్మడి మాటలు సంచలనం రేపుతున్నాయి. ఉత్తరాది హీరోయిన్స్ కు గ్లామర్ విషయంలో తప్ప నటన విషయంలో సౌత్ హీరోయిన్ల తరువాతే ఉంటారని, అందాలు ఆరబోస్తేనే గుర్తింపు వస్తుందని అక్కడి వాళ్ళు భావిస్తారని చెప్పింది. నా కెరీర్ లో కూడా కొన్ని అవగాహనా రాహిత్యంతో కొన్ని తప్పులు జరిగాయని, నాకు కొన్ని కథలు చెప్పిన విధానం వేరు .. ఆ తరువాత తీసిన విధానం వేరుగా ఉండడంతో డబ్బులు వెనక్కి ఇచ్చేసి సినిమాకు గుడ్ బాయ్ చెప్పేదాన్నని, దానివల్ల కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నానని ఇంద్రజ తెలిపింది.