9000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పిన ఇన్ఫోసిస్

Friday, January 20th, 2017, 04:12:17 PM IST

INFO
ఒక సంవత్సరంలో దాదాపుగా తొమ్మిది వేల మంది ఉద్యోగులను బయటకు పంపింది ఒక మల్టీ నేషనల్ కంపెనీ. ఒకవైపు ఆటోమేషన్ ప్రభావం, మరొకవైపు పెద్ద కంపెనీ అయినా అందుకు తగ్గట్టు ప్రదర్శన కనబరచలేకపోవడం ఈ ఉద్యోగులకు ముప్పు తెచ్చి పెట్టింది. అదికూడా ఆషామాషీ కంపెనీ కాదు. ఇండియాలోనే నెంబర్ 2 కంపెనీ గా సర్వీసులు అందిస్తున్న ఇన్ఫోసిస్ కంపెనీ. ఐటీ సేవల్లో ఒక బ్రాండెడ్ కంపెనీగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ గత సంవత్సర కాలంగా 8000 వేల నుండి 9000 వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు ఆ కంపెనీ హెచ్ఆర్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ చెప్పారు.

అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు మరింత అడ్వాన్స్డ్ ప్రాజెక్టులలో పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి మూడు నెలలకు 2000 మంది ఉద్యోగులను బయటకు పంపుతున్నామని, అయితే తీసేసే ఉద్యోగులకు స్పెషల్ కోర్స్ లలో ట్రైనింగ్ ఇచ్చిన తరువాతే వాళ్ళను బయటకు పంపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్రైనింగ్ వాళ్లకు కొత్త ఉద్యోగాలకు ఉపయోగపడుతుందని శంకర్ చెప్పారు. ఆటోమేషన్ రంగం వేగంగా విస్తరిస్తుందని, ఈ నేపథ్యంలోనే ఉద్యోగాలు తగ్గిపోతున్నట్టు ఆయన వివరించారు. అయితే కేవలం ఆటోమేషన్ కాకుండా కంపెనీ కూడా ఆశించిన మేర రాణించలేకపోవడం మరొక కారణంగా చెప్తున్నారు.