చాప కింద నీరులా పవన్ – త్రివిక్రమ్ ఫిల్మ్..!

Friday, January 26th, 2018, 01:58:54 AM IST

పవన్ వీరాభిమాని నితిన్ చాప కింద నీరులాగా పనిమొత్తం పూర్తి చేసేశాడు. లై సినిమా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న నితిన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం అయిన తరువాత ఎక్కడా దీని ఊసే లేదు. కాగా సడెన్ గా నితిన్ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడిస్తూ ఫాన్స్ ని సంతోష పెట్టాడు. కేవలం ఒక్క సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయినట్లు నితిన్ ట్విట్టర్ లో తెలిపాడు.

అతి త్వరలోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నట్లు నితిన్ తెలిపాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన మేఘా ఆకాష్ వరుసగా రెండవ సారి నటిస్తోంది. లై చిత్రంలో కూడా మేఘా ఆకాషే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి కథని త్రివిక్రమ్ అందించారు. తమన్ సంగీతం సమకూర్చారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.