అందరూ క్యూ కట్టేలా చరణ్ సెట్ లో ఏముంది..!!

Friday, December 1st, 2017, 09:37:44 PM IST

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం 1985. తొలిసారి రామ్ చరణ్ వైవిధ్యభరితమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. దీనితో చరణ్ నటన ఏవిధంగా ఉంటుందో అనే ఆసక్తి అటు సినీవర్గాల్లో, ఇటు మెగా అభిమానుల్లో నెలకొనివుంది. సుకుమార్ ఈ చిత్రాన్ని అందమైన పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరిస్తూ రామ్ చరణ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ మధ్యన దర్శక ధీరుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ రంగస్థలం చిత్ర సెట్ ని సందర్శించారు.

వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు థమన్ కూడా రంగస్థలం సెట్ ని సందర్శించాడట. ఈ విషయాన్ని థమన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ చిత్ర విజయంపై రామ్ చరణ్ అభిమానులకు ఎటువంటి అనుమానం అక్కర్లేదని వెల్లడించారు. వరుసగా సెలెబ్రిటీలు రంగస్థలం సెట్ ని సందర్శిస్తుండడంతో అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారా లేక నిజంగా రంగస్థలం కోసం వేసిన సెట్ లో ఏదైనా అద్భుతం ఉందా అనే చర్చ అభిమానుల మధ్య జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments