బాహుబలి 2 కి కనీ వినీ ఎరుగని రీతిలో ..

Friday, February 17th, 2017, 12:13:59 PM IST


బాహుబలి మొదటి భాగం తో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు రెండో పార్ట్ కి కూడా భారీ ప్రమోషన్ లు సిద్దం చేస్తున్నారు. ఏప్రిల్ 28 న ఈ సినిమా విడుదల అవ్వబోతూ ఉండగా అందుకు తగ్గట్టు ప్రమోషన్ లు పర్ఫెక్ట్ ప్లాన్ లో పెట్టేసారు. ఇప్పటి వరకూ టీజర్ కూడా రాలేదు అని ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న నేపధ్యం లో జక్కన్న ఫైనల్ కట్ దగ్గర ఆగిపోయారు అని అంటున్నారు. అలాగని ప్రమోషన్స్ విషయంలో లేట్ అయితే.. డ్యామేజ్ జరుగుతుందనే విషయం రాజమౌళికి బాగానే తెలుసు. అందుకే టీజర్ కు బదులుగా.. వర్చువల్ రియాలిటీ వెర్షన్ అయిన ది స్వోర్డ్ బాహుబలితో ప్రమోషన్స్ కు ప్లాన్ చేశాడు జక్కన్న.ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి టీజర్ ను తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి ప్రదర్శించబోతున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ఒక క్లిప్ ఉంటుంది. మాహిష్మతి సెట్స్ కి సంబంధించిన రియల్ టైం అనుభూతిని పొందచ్చు. ఇందు కోసం ప్రత్యేకమైన గ్లాసెస్ ధరించాల్సి ఉంటుంది. అయితే.. బాహుబలి2 పబ్లిసిటీ యాక్టివిటీస్ లో భాగంగా దీన్ని ఏపీ.. తెలంగాణల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.