రామ్ చరణ్ కు ఓకే చెప్పిన బాలీవుడ్ బ్యూటీ.. ఐటమ్ గర్ల్ గా..?

Monday, September 25th, 2017, 12:55:03 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు హీరోగా, ఇటు నిర్మాతగా బిజీగా గడువుతున్నాడు. మెగాస్టార్ 151 చిత్రం సైరా నరసింహారెడ్డి కి రామ్ చరణ్ నిర్మాత అనే విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సంబందించిన నిర్మాణ పనుల్లో చెర్రీగా కాస్త తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరో వైపు సుకుమార్ దర్శకత్వంలోని రంగస్థలం చిత్ర షూటింగ్ లో చెర్రీ పాల్గొనాల్సి ఉంది.

సైరా నరసింహారెడ్డి చిత్ర పనులతో చరణ్ బిజీగా ఉండడంతో రంగస్థలం షూటింగ్ కు బ్రేక్ పడినట్లు సినీవర్గాలు అంటున్నాయి. ఈ చిత్ర షూటింగ్ కోసం భారీ ఖర్చుతో విలేజ్ సెట్ ని వేసారట. త్వరలోనే చరణ్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సినీవర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉంటుందట. అందులో చెర్రి సరసన డాన్స్ చేయడానికి బాలీవుడ్ భామ కరీనా కపూర్ ని రంగం లోకి దించుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే కరీనా కపూర్ ని సంప్రదించారని.. ఐటమ్ సాంగ్ లో నటించేందుకు ఆమె ఉత్సాహం చూపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments