గాల్లోనే అఖిల్ విన్యాసాలు..పడేయవు కదా..!

Tuesday, November 14th, 2017, 07:00:52 PM IST

అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న రెండవ చిత్రం హలో. విక్రం కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి చిత్రంలో తనకు సూట్ కాని కథతో వచ్చిన అఖిల్ కు నిరాశ తప్పలేదు. దీనితో తన తనయుడి రెండవ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని ప్రతిభ గల దర్శకుడు విక్రం కుమార్ ని ఏరికోరి ఎంపిక చేశారు. విక్రం కుమార్ అయితే ఎదో ఒక వెరైటీ పాయింట్ తోనే వస్తారనే భరోసా ఉంది. అక్కినేని కుటుంబానికి మనం వంటి మరపు రాని చిత్రాన్ని అందించింది కూడా ఈ దర్శకుడే.

ఈ చిత్రానికి టైటిల్ హలో అని అనౌన్స్ చేసిన తరువాత యూత్ ఫుల్ స్టొరీ తో వస్తున్నారని అఖిల్ కు హిట్ ఖాయం అని అక్కినేని అభిమానులు భావించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కాళ్ళు గాలిలో ఉండేలా అఖిల్ తలక్రిందులుగా కనిపిస్తాడు. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గాల్లో విన్యాసాలు చేస్తూ అఖిల్ కనిపిస్తున్నాడు. తొలి చిత్రంలో ఇలాంటి విన్యాసాలకే అఖిల్ ప్రయత్నించాడు. ఫలితం ఏంటో అందరికి తెలిసిందే. కాని ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత కావడం, విక్రం కుమార్ దర్శకుడు కావడంతో అంత పకడ్బందిగా ఉంటుందని అక్కినేని ఫాన్స్ అంటున్నారు. కాగా ఈ చిత్ర టీజర్ ఈ నెల 16 న విడుదల కాబోతుండగా సినిమాని డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  •  
  •  
  •  
  •  

Comments